నగరపాలక అభివృద్ధి పనులపై మంత్రి సవిూక్ష

share on facebook

ఖమ్మం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ఖమ్మం నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులపై రోడ్లు, భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం సవిూక్షించారు. నగరంలోని ఎన్‌ఎస్‌పీ అతిథి గృహంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన అభివృద్ధి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శంకుస్థాపనలు చేసి ఇప్పటికీ ప్రారంభించని పనులను వెంటనే చేపట్టాలని, పనులు ప్రారంభించని గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో ఏ శాఖనుంచైనా అనుమతి రావాల్సి ఉంటే ఆయా శాఖల అధికారులతో జిల్లా కేంద్రంలోనే సమావేశం ఏర్పాటు చేసి వెంటనే అనుమతి ఉత్వర్వులు జారీ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని సంయుక్త కలెక్టరు వినయ్‌కృష్ణారెడ్డిని ఆదేశించారు. సమావేశంలో మేయరు పాపాలాల్‌, కమిషనర్‌ శ్రీనివాస్‌, కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌ విజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

రహదారి అక్రమణల కూల్చివేత

ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ కూడలి నుంచి పీజీ కళాశాల వరకు రహదారిని ఆక్రమించిన కట్టడాలను నగరపాలక రోడ్లు, భవనాల శాఖ, రెవిన్యూశాఖల సంయుక్త ఆధ్వర్యంలో కూల్చివేశారు. రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆక్రమణలను కూల్చివేస్తున్నట్లు ఆర్‌అండ్‌బీ డిఈ యుగేందర్‌ తెలిపారు. ఇదే సమయంలో నగరపాలక సంస్థ అనుమతి లేకుండా నిర్మించిన ఇళ్లను సైతం స్వల్పంగా కూల్చివేసి ఇళ్లను తొలగించుకోవాలని యజమానులను కమిషనర్‌ శ్రీనివాస్‌ ఆదేశించారు. కూల్చివేత పనులను ఆర్డీవో పూర్ణచంద్ర, అర్బన్‌ తహసీల్దార్‌ శ్రీలత, ఏసీపీలు గణెళిష్‌, రామ్‌చందర్‌లు పరిశీలించారు.

Other News

Comments are closed.