నవబారత్‌ నిర్మాణంలో చురుకుగా పాల్గొందాం

share on facebook

వరంగల్‌ అర్బన్‌, సెప్టెంబర్‌ 8 (జ‌నంసాక్షి):నవభారత్‌ నిర్మాణం కోసం జిల్లా అధికారులంతా శుక్రవారం ఉదయం ప్రతిజ్ఞ చేశారు. జడ్పీ సమావేశ మందిరంలో హాజరయిన అధికారులచేత జడ్పీ సీఈఓ విజయగోపాల్‌ ప్రతిజ్ఞ చేయించారు. పేదరికం అవినీతి లేని తీవ్రవాద మతోన్మాద కులరహిత స్వచ్చమైన భారత దేశంకోసం 2022 నాటికి నవ భారత నిర్మాణానికి సమిష్టిగా కృషి చేద్దామని ఈసందర్బంగా అధికారులు ప్రతిజ్ఞ చేశారు.

నేడు కాళోజి 103వ జయంతి వేడుకలు

నేడు శనివారం ప్రముఖ కవి, సాహితి వేత్త కాళోజి నారాయణరావు 103 వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా భాషాదినోత్సవంగా నిర్వహించుటకు నిర్ణయించిన మేర జిల్లాలో కూడా ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం ఉదయం 10గంటలకు కాళోజి సెంటర్‌లోనికాళోజి నారాయణరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ అమ్రాపాలి తెలిపారు. ఈకార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలు అదిక సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్‌ కోరారు.

Other News

Comments are closed.