నవ్య పై దాడికి పాల్పడిన రోహిత్ ను కఠినంగా శిక్షించాలి:

share on facebook

మిర్యాలగూడ. జనం సాక్షి.
నల్గొండ పట్టణం పానగల్ కు చెందిన నవ్య ముదిరాజ్ పై దాడికి పాల్పడిన ప్రేమోన్మాది రోహిత్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీసీ కళాశాల విద్యార్థినీలు శైలజ, శ్వేత డిమాండ్ చేశారు. శనివారం స్థానిక హాస్టల్లో రోహిత్ పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థినులపై దాడులు రోజురోజుకు పెరిగి పోతున్నాయని ప్రత్యేక నిఘా పోలీసు పెట్టాలన్నారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగవని అన్నారు. దాడిని ఖండించిన వారిలో విద్యార్థినిలు చిన్ని,సాయి ప్రియ, శ్వేత,రాజేశ్వరి,అశ్విని, బీసీ సంఘం పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి మురళీ యాదవ్, బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరథ నాయక్, కేపీ రాజు తదితరులు ఉన్నారు

Other News

Comments are closed.