నాగసానిపపల్లి గ్రామంలో అంబరాన్నంటిన భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ సంబరాలు

share on facebook

 

శ్రీరంగాపురం: ఆగస్ట్ 13 (జనంసాక్షి)
శ్రీరంగాపురం మండలంలోని నాగసానిపల్లి గ్రామంలో ఫ్రీడమ్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వాతంత్ర్య వజ్రోత్సవ ఉత్సవాలలో భాగంగా నేడు ఉదయం 8.30 గంటలకు గ్రామంలో ఉన్నటువంటి అన్ని వీధులలో పెద్ద మొత్తంలో గ్రామ ప్రజలు యువకులు మరియు హై స్కూల్ టీచర్స్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ గ్రామపంచాయతీ కార్యదర్శి మరియు అంగన్వాడీ టీచర్స్ ఆశా కార్యకర్త తో పాటు పెద్ద మొత్తంలో యువకులు మరియు విద్యార్థులు ప్రజలు ఫ్రీడమ్ ర్యాలీ పాల్గొని ,చివరగా గ్రామ  నడిబొడ్డున విద్యార్థులతో ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా గ్రామ సర్పంచ్ ధన్యవాదాలు తెలిపారు.

Other News

Comments are closed.