నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీ ఎందుకు పునరుద్దరణకు నోచలేదు

share on facebook

ప్రగతినివేదన సభలో వివరణ ఇచ్చుకోవాలి

నిజామాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్దరణకు కట్టుబడి ఉన్నామని ఎంపీ కల్వకుంట్ల కవితతో సహా మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి గత మూడేళ్లుగా ఇస్తున్న హావిూలు అమలుకావడం లేదు. అసెంబ్లీలో సిఎం కెసిఆ/- కూడా దీనిపై గతంలో ప్రకటనచేశారు. ఫ్యాక్టరీ పునరుద్దరణకు కట్టుబడి ఉన్నామని ఆ మేరకు కార్యాచరణ చేస్తున్నామని అన్నారు. రైతులు ముందుకు వస్తే సహకార రంగంలో దీని పునరుద్దరణకు తోడ్పడుతామని అన్నారు. ఈ ఫ్యాక్టరీ పునరుద్దరించడం ద్వారా అటు రైతులను ఇటు కార్మికులను ఆదుకోవాలన్నదే సర్కార్‌ లక్ష్యమన్నారు. నిజాంషుగర్‌ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నామని అన్నారు. రైతులు కొ ఆపరేటివ్‌ పద్దతిలో ముందుకొస్తే నడిపేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. ఈ రకంగా అయినా తప్పకుండా ఫ్యాక్టరీకి పూర్వవైభవం వస్తుందని స్పష్టం చేశారు. అయితే నాలుగేళ్లయినా అది కార్యరూపం దాల్చలేదు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని భ్రష్టుపట్టించిందే చంద్రబాబు నాయుడని విమర్శించిన పాలకులు దానిని పునరుద్దరణలో తమ హావిూలను పక్కన పెట్టారు. గత పాలకుల నిర్లక్ష్యం వలన చెరుకు రైతులకు కష్టాలు వచ్చిపడ్డాయని అన్నారు. చెరుకు ఉత్పత్తి ఉన్నా నష్టాల్లో చూపారని విమర్శించారు. చెరుకు రైతులకు టీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాలు రైతులను, ఉద్యోగులను మభ్యపెట్టాడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. వారికి సమస్యను పరిష్కరించడం కన్నా దానివల్ల రాకీయ లబ్ది పొందాలన్నదే దురాలోచన అన్నారు. ప్రాజెక్టులపై ఇంకా రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా చెబుతూ వచ్చారే తప్ప కనీసంగా దాని గేట్లుకూడా తెరవలేకపోయారు. దీనిని ఎప్పుడు తెరిపిస్తారో, ఇంతకాలం ఎందుకు దీనిని పట్టించుకోలేదో చెప్పాలని కాంగ్రెస్‌, బిజెపి నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రగతినివేదన సభలో దీనిపై వివరణ ఇవ్వాలన్నారు.

 

Other News

Comments are closed.