నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

share on facebook

హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి): స్వామి రామానంద తీర్థ గ్రావిూణ సంస్థలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతకు 30 రోజుల ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ కల్పణ అందిస్తున్నామని జలాల్‌పూర్‌లోని ఎస్‌ఆర్‌టీఆర్‌ఐ డైరెక్టర్‌ ఎన్‌ కిషోర్‌రెడ్డి గురువారం తెలిపారు. ఇంటర్‌విూడియట్‌ లేదా ఐటీఐ, డిప్లమా మెకానికల్‌లో విద్యార్హత ఉన్న నిరుద్యోగ యువతకు సీఎస్‌సీ ఆపరేటింగ్‌ లో బెంగుళూరుకు చెందిన మైక్ర్రోమేటిక్‌ మెషిన్‌ టూల్స్‌ లిమిటెడ్‌ కంపెనీ సహకారంతో 30 రోజుల సాంకేతిక శిక్షణతో పాటు తప్పనిసరిగా ఉద్యోగం కల్పించనున్నట్లు తెలిపారు. 18 నుండి 25 సంవత్సరాలలోపు వయసు ఉండి ఉద్యోగం చేయడానికి ఆసక్తి ఉన్న వారికి ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వీరికి హైద్రాబాద్‌, బెంగుళూరు, విశాఖపట్నం లాంటి నగరాల్లో ఉద్యోగం ఇవ్వడంతో పాటు మొదట 8వేల వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సక్తిగల అభ్యర్థులు అర్హత ఒరిజినల్‌ సర్టిఫికేట్స్‌తో పాటు జిరాక్స్‌ సెట్‌, రెండు పాస్‌పోర్లు సైజ్‌ ఫోటోలు, ఆదార్‌ కార్డుతో హాజరు కావాలని తెలిపారు. ఈ నెల 22వ తేదీన ఉదయం సంస్థలో హాజరు కావాలని తెలిపారు. మిగతా వివరాలకు 9951181416 నంబుకు సంప్రదించాలని కోరారు.

Other News

Comments are closed.