నిరుద్యోగులను మోసగించిన టిడిపి: డిసిసి

share on facebook

ఏలూరు,మే17(జ‌నం సాక్షి): నిరుద్యోగులకు టిడిపి  ప్రభుత్వంలో మొండి చెయ్యి చూపింవదని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు రఫీఉల్లా బేగ్‌  అన్నారు. వారికి నిరుద్యోగ భృతిని ఇస్తామన్న హావిూని కూడా విస్మరించారని అన్నారు. వైకాపా నేత జగన్‌ సైతం బిజెపికి అనుకూలంగా మారారని ఆయన అన్నారు. దేశంలో 14 రాజకీయ పార్టీలు ప్రత్యేక¬దాకు అనుకూలంగా ఉన్నాయని ఆయన తెలిపారు. జగన్‌కు ప్రజలపై విశ్వాసం ఉంటే ¬దాపై  బిజెపిని నిలదీయాలని  ఆయన అన్నారు. ప్రజా సమస్యలను అధికార, విపక్ష పార్టీలు విస్మరించాయని అందువల్ల 2019 ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా, మండల, బూత్‌ స్థాయిల్లో అందర్నీ భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. 2019 ఎన్నికల్లో రాహుల్‌ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు.  గతంలో ఎఐసిసి అధ్యక్షునిగా, 2011లో ప్రధాన మంత్రిగా అవకాశం వచ్చినా ఆయన తిరస్కరించారని  చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో మోడీ, చంద్రబాబు ప్రభుత్వాలే ఆంధ్రా ప్రజల్ని మోసం చేశాయని, 2019లో రాష్ట్రానికి  ¬దా ఇచ్చేది కాంగ్రెస్‌ మాత్రమే అని ఆయన అన్నారు. విభజన చట్టాలు అమలు లేదని, దళితులపై హింస పెరిగిందని, రైతులను గాలికి వదిలేశారని విమర్శించారు.  ప్రజా సమస్యలపై పోరాడుతున్న కాంగ్రెస్‌కు మంచి భవిష్యత్‌ ఉందన్నారు. బడుగు, బలహీన, దళిత వర్గాల్లో అభిమానం ఉందని, కొత్త ఉత్సాహంతో యువరక్తంతో రాబోయే రోజుల్లో కాంగ్రెసే మరింత బాగా పనిచేస్తుందని అన్నారు.
———

Other News

Comments are closed.