నిర్మలా సీతారామన్‌తో అమెరికా రక్షణమంత్రి భేటీ

share on facebook

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి):  అమెరికా రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌తో.. ఇవాళ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల అధికారులు కూడా పాల్గొన్నారు. రష్యా నుంచి ఎస్‌-400 మిస్సైల్‌ను భారత్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నది. అయితే ఆ అంశాన్ని కూడా చర్చిస్తామని అమెరికా రక్షణ మంత్రి అన్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచాలన్న ఉద్దేశంతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. చాలా పారదర్శకంగా చర్చలు ఉంటాయని మాటిస్‌ చెప్పారు.

Other News

Comments are closed.