నేటినుంచి ఏషియా కప్‌

share on facebook

రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో దుబాయ్‌ చేరుకున్న జట్టు

ముంబై,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): సుదీర్ఘ ఇంగ్లాండ్‌ పర్యటన ముగించుకున్న టీమిండియా.. మరో కప్‌ కు సిద్ధమైంది. ఆసియా కప్‌ కు ఐసీసీ రెండు గ్రూపులుగా వీడిదీసి ఆరు జట్టులను ఎంపిక చేసింది. యూఏఈ వేదికగా ఈ నెల 15 నుంచే జరగనున్న ఆసియా కప్‌ మ్యాచుల్లో 20 వరకు లీగ్‌ మ్యాచులు జరుగుతాయి. ఈ నెల 28న పైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. కాగా వరుస మ్యాచులు ఆడుతున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. దీంతో జట్టు సారధ్యం బాధత్యలను బీసీసీఐ.. రోహిత్‌ శర్మకు అప్పజెప్పింది. ఇప్పటికే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా ధోనీ, భువనేశ్వర్‌, పలువురు క్రికెటర్లు దుబాయ్‌ చేరుకున్నారు. శనివారం గ్రూప్‌ బి నుండి తొలి మ్యాచ్‌ బంగ్లాదేశ్‌, శ్రీలంక పోటీ పడనున్నాయి. సాయంత్రం 5 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం అవుతుంది. ఇదిలా ఉంటే.. ఈ నెల 18న భారత్‌ తొలి మ్యాచ్‌ హాంకాంగ్‌ మొదలుపెట్టనుంది. సెప్టెంబర్‌ 19న భారత్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ తలపడనుంది. అయితే మొత్తం 14 రోజుల పాటు ఆసియా కప్‌ జరగనుంది. సెప్టెంబర్‌ 21 నుంచి లీగ్‌ మ్యాచ్‌ లను ముగించి.. గ్రూప్‌ ఏ, బిలో టాప్‌ 2 లో నిలిచిన జట్లు సూపర్‌ ఫోర్‌ కు అర్హత సాధిస్తాయి. ఈ నెల 28న ్గ/నైల్‌ మ్యాచ్‌ జరగనుంది. ్గ/నైల్‌ మ్యాచ్‌ సహా అన్ని మ్యాచులు సాయంత్రం 5 గంటలకు జరగనున్నాయి. కాగా భారత్‌, పాకిస్థాన్‌ ఒకే గ్రూపులో ఉండడం విశేశం. సెప్టెంబర్‌ 19న జరగనున్న భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌.. అభిమానులకు పండగనే చెప్పాలి.

భారత్‌ జట్టు: కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, అంబాటి రాయుడు, మనీష్‌ పాండే, కేదార్‌ జాధవ్‌, ఎంఎస్‌ ధోనీ, దినేష్‌ కార్తీక్‌, హార్ధిక్‌ పాండ్యా, కుల్దీప్‌ జాదవ్‌, యుజ్‌వేంద్ర చౌహాల్‌, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జాస్పీట్ర్‌ బూమ్రా, శార్ధూల్‌ ఠాగూర్‌, కే ఖలీల్‌ అహ్మద్‌

Other News

Comments are closed.