నేటినుంచి బిజెపి మోటర్‌ సైకిల్‌ యాత్ర

share on facebook

నల్లగొండ,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): ప్రధానిగా నరేంద్రమోదీ అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 17 నుంచి 26 వరకు పల్లెపల్లెకు మోటారు సైకిల్‌ యాత్ర నిర్వహించనున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి తెలిపారు. ప్రతి మండలంలో 11 ద్విచక్ర వాహనాలతో 22 మంది బృందం రోజు మండలంలో కనీసం నాలుగు గ్రామాలలో సభలు నిర్వహిస్తారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలియజేస్తూనే వారికి ఉన్న సమస్యలు తెలుసుకోవాలన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలిపించుకోవడానికి యాత్ర ప్రయోజనం కల్పిస్తుందని చెప్పారు.

Other News

Comments are closed.