నేటి పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత

share on facebook

రామగుండం,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశామని రామగుండం పోలీస్‌కమిషనర్‌ సత్యనారాయణ తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి మావోయిస్టులు రాకుండా ఉండేందుకు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇక ఓటర్లను ప్రభావితం చేసేందుకు మద్యం, డబ్బు పంపిణీ చేసేవారిపైన ఉక్కుపాదం మోపుతున్నారు. గత రెండు రోజుల్లోనే లక్షలాది రూపాయలు స్వాధీనం చేసుకున్నామని సత్యనారాయణ తెలిపారు. ఎన్నికలు బహిష్కరించాలంటూ మావోయిస్టుల పిలుపునిచ్చిన నేథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. సుమారు 4 వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలు, కాళేశ్వరం సవిూపంలో మంథని నియోజకవర్గంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సత్యనారాయణ

చెప్పారు. రెండు, మూడు సంవత్సరాలుగా మావోయిస్టు కదలికలు ఎక్కడా లేవన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద కేంద్ర సాయుధ బలగాల పహారాతో భద్రత ఉంటుందని తెలిపారు. మద్యం, డబ్బు పంపిణీచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలిస్‌ కమిషనర్‌ సత్యనారాయణ హెచ్చరించారు.

 

 

Other News

Comments are closed.