నేడు ఓటరు దినోత్సవం

share on facebook

వరగంల్‌,జనవరి24(జ‌నంసాక్షి): జాతీయ ఓటరు దినోత్సవంలో భాగంగా ఏటా 25న ఓటరు దినోత్సవాన్ని జరుపుకోవాలని అప్పటి కమిషన్‌ నిర్ణయించారు. ప్రతీఒక్కరూ ఓటు వినియోగించుకోవాలనే లక్ష్యంతో వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి తమవంతు సహకారం అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువకులు కూడా ముందుకు వచ్చి ఓటు నమోదుకు సిద్ధమవుతున్నారు.చరిత్రను తిరగ రాయాలన్నా, నాయకుల తలరాతలు మార్చాలన్నా ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది. అలాంటి ఓటుహక్కు ఒక్కోసారి అదృష్ట జాతకుల్ని ఐదేళ్ల పాలనకు అవకాశం కల్పించి మార్గదర్శకపాలనకు పునాదులు వేయిస్తుంది. అలాంటి తీర్పు ఇవ్వాలంటే ఓటర్లే కీలకం అలాంటి ఓటు ప్రస్తుతం మన యువత చేతుల్లోకి రాబోతుంది. ఓటు హక్కుపై చైతన్యం కల్పించడం కోసం ఎన్నికల కమిషన్‌ మరింత వేగవంతంగా చర్యలు చేపడుతోంది. ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం కావాలని ముఖ్యంగా యువత ఓటుహక్కు గురించి తెలుసుకోవాలని దేశవ్యాప్తంగా చైతన్యం చేసేందుకు ఎన్నికల కమిషన్‌ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ అధికారులు ఇప్పటికే అన్ని విద్యాసంస్థల్లో డిజిటల్‌ విధానంలో ప్రచారం నిర్వహించారు. అక్షరాస్యులుగా ఉన్నా ఇంకా కొన్ని ఓట్లు చెల్లనివిగా మిగిలిపోతున్నాయి. దానిపై కూడా ఓటర్లకు అవగాహన కల్పించారు. గతంలో ఓటుహక్కు నమోదు చేసుకోవాలంటే ఆయా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రస్తుత ఎన్నికల సంఘం ఓటు నమోదును వేగవంతం చేసేందుకు సిబ్బందినే ఓటర్లు ముందుకు తెచ్చి ఓటుహక్కు నమోదు పక్రియ
మరింత సులభతరం చేసింది. ఇదేకాక ఆన్‌లైన్‌లోనూ ఓటు నమోదు చేసుకునే వీలు కల్పించేసరికి ఓటర్లు నమోదు ఓటర్ల ముందుకు వచ్చింది. ఓటు నమోదు చెయ్యడమే కాదు గుర్తింపు కార్డులు వెంటనే జారీ పక్రియ చేయడంకోసం అధికారులు సంసిద్ధులయ్యారు. ప్రజాస్వామ్యంలో ఓటు పునాది లాంటిది. దీనిని ఉపయోగిస్తే మంచి సమాజాన్ని ఇచ్చిన వారమవుతాం. చరిత్రను తిరగరాసే నాయకులను తెచ్చుకునే అవకాశం మన చేతిలో ఉంటుంది. ఎన్నికల కమిషన్‌ నిబంధనలు కఠినతరం చేయడం వల్ల మంచి నాయకులు పాలనలోకి వస్తున్నారు. యువతకు అవకాశం లభిస్తుంది. ఎలక్టాన్రిక్‌  మిషన్‌లపై మరింత అవగాహన కల్పిస్తే ఓట్లు మురిగిపోయో అవకాశం ఉండదు. ఓటును ప్రతీఒక్కరూ ఉపయోగించు కోవాలన్న చైతన్యం కోసం దీనిని నిర్వహిస్తున్నారు. ఓటు హక్కు ఉండి ఉపయోగించుకోకపోవడం దారుణం. ఓటుహక్కు ఉన్న వారు ప్రతీ ఒక్కరూ ఓటు వెయ్యాలి. విభిన్న ప్రతిభావంతులు ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. చదువులేని వారు కూడా అడిగి మరీవేస్తున్నారు. అర్హులైన వారంతా ఓటరుగా చేరండని అంటున్నారు.

Other News

Comments are closed.