నేడు క్రీడా ఎంపిక పోటీలు

share on facebook

కొత్తగూడెం,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : ఉమ్మడి జిల్లా పాఠశాల క్రీడల్లో భాగంగా ఈ నెల 20వ తేదీన పాల్వంచ కిన్నెరసాని స్పోర్ట్స్‌ ఆశ్రమ పాఠశాలలో బాలబాలికలకు విలువిద్య క్రీడా ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల కార్యదర్శి టీ లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికల్లో పాల్గొనే విద్యార్థులు అండర్‌ -14 విభాగంలో 1.1.2006 తరువాత జన్మించి ఉండాలని, అండర్‌-17 విభాగంలో 1.1.2003 తరువాత జన్మించిన వారు అర్హులుగా ఉంటారని తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే వారు ఆధార్‌ కార్డు, ఒరిజినల్‌ స్టడీ సర్టిఫికెట్‌తో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట్‌నాయక్‌ను సంప్రదించి, ఈ నెల 20వ తేదీ ఉదయం పది గంటల్లోపు రిపోర్టు చేయాలని సూచించారు. అంతర్జాతీయ క్రీడాకారులు జీ మారప్ప, పీ ప్రసాద్‌లు హాజరై ఎంపికలు నిర్వహిస్తారన్నారు. క్రీడాకారులు తమ వెంట క్రీడాపరికరాలను తెచ్చుకోవాలని కోరారు.

Other News

Comments are closed.