నేడు జనగామలో జాబ్‌మేళా

share on facebook

జనగామ,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 13న జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలాజీ సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 13న శుక్రవారం ఉదయం 11గంటలకు జిల్లా కేంద్రంలోని శ్రీ సాయితేజ ఐటీఐలో ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఐటీఐ పూర్తిచేసిన విద్యార్థులు సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, ఫొటోలతో హాజరుకావాలని తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Other News

Comments are closed.