నేడు నిమజ్జనానికి తరలనున్న గణనాథులు

share on facebook

– ట్రాఫిక్‌ ఆంక్షలు విధించిన పోలీసులు
హైదరాబాద్‌, సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  హైదరాబాద్‌ నగర్‌లో సెప్టెంబర్‌ 12న గణెళిష్‌ శోభాయాత్ర అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగనుంది. దీంతో నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. వినాయకుడి శోభాయాత్ర కొనసాగే మార్గాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయనీ.. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు సూచించారు.
పాతబస్తీ నుంచీ ఊరేగింపుగా వచ్చే గణనాథులు, కేశవగిరి అలియాబాద్‌, నాగుల్‌చింత నుంచి వచ్చే విగ్రహాలు.. చార్మినార్‌, మదీన, అప్జల్‌ గంజ్‌, ఎంజే మార్కెట్‌, అబిడ్స్‌, విూదుగా లిబర్టీ, అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌ లేదా ఎన్టీఆర్‌ మార్గ్‌ విూదుగా ట్యాంక్‌ బండ్‌ చేరుకోవాలని సూచించారు. అలాగే టప్పాచబుత్ర అసిఫ్‌ నగర్‌ విూదుగా వచ్చే విగ్రహాలు సీతారాం బాగ్‌, బోయిగూడ కమాన్‌ విూదుగా గోషామహల్‌ అలస్కా నుంచి ఎంజే మార్కెట్‌ చేరుకోవాలని సూచించారు.
–  మరోవైపు సికింద్రాబాద్‌ నుంచే గణెళిషుల విగ్రహాలు ఆర్పీరోడ్‌, ఎంజీ రోడ్‌, కర్బలా మైదానం, కవాడీగూడ, ముషీరాబాద్‌, ఎక్స్‌రోడ్‌ విూదుగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ చేరుకోవాలని సూచించారు. అక్కడి నుండి నారాయణగూడ చౌరస్తా, హిమాయత్‌ నగర్‌, వై జంక్షన్‌ విూదుగా లిబర్టీకి చేరుకోవాలని, అక్కడినుంచి ట్యాంక్‌బండ్‌పైకి చేరుకోవాలని పోలీసులు పేర్కొంటున్నారు. తార్నాక వైపు నుంచి వచ్చే విగ్రహాలు ఓయూ డిస్టెన్స్‌ ఎడ్యూకేషన్‌ రోడ్‌, అడిక్‌మెట్‌ నుంచి.. విద్యానగర్‌ విూదుగా ఫీవర్‌ ఆస్పత్రి మార్గంలోని జాయిన్‌ అవ్వాల్సి ఉంటుంది.
– ఇకపోతే ఈస్ట్‌ జోన్‌ నుంచి వచ్చే వినాయకుడి విగ్రహాల ఊరేగింపు ఉప్పల్‌, రామంతాపూర్‌, ఛే నెంబర్‌ జంక్షన్‌, శివంరోడ్‌, ఓయూ ఎన్సీసీ గేట్‌, డీడీ హస్పిటల్‌, హిందీ మహా విద్యాలయ క్రాస్‌ రోడ్‌ విూదుగా.. ఫీవర్‌ ఆస్పత్రి, బర్కత్‌పురా చౌరస్తా, నారాయణ గూడ చౌరస్తా విూదుగా ట్యాంక్‌ బండ్‌పైకి చేరుకోవాలి.. అలాగే దిల్‌సుఖ్‌ నగర్‌ నుంచి వచ్చే ఊరేగింపు విగ్రహాలు ఐఎస్‌ సదన్‌సైదాబాద్‌, చంచల్‌ గూడ, నల్లగొండ చౌరస్తా విూదుగా సరూర్‌ నగర్‌ చెరువును చేరుకోవాలి.
– మెహిదీపట్నం దాటిన తరువాత వచ్చే ప్రాంతం టోలిచౌకి నుంచి వచ్చే విగ్రహాల ఊరేగింపు టోలిచౌకి, రేతిబౌలి, మెహిదీపట్నం, మాసబ్‌ టాంక్‌, అయోధ్య జంక్షన్‌, నిరంకారీ భవన్‌ విూదుగా.. పాత సైఫాబాద్‌ పీఎస్‌, ఇక్బాల్‌ మినార్‌ విూదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌ కు చేరుకోవాలి. అటు ఎర్రగడ్డ నుంచి వచ్చే విగ్రహాలు ఎస్సార్‌ నగర్‌, అవిూర్‌ పేట, పంజాగుట్ట, వీవీ విగ్రహం దగ్గర నుంచి ట్యాంక్‌ బండ్‌కు చేరుకోవాలి. ఈ క్రమంలో వినాయక విగ్రహాలు తరళివేళ్లే రూట్లలో ఇతర వాహనాలకు అనుమతి ఉండదనే విషయా ప్రజలు గనించాలని పోలీసులు తెలిపారు.
ట్రాఫిక్‌ ఆంక్షలు..
గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు ఈ  ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయని పోలీస్‌ అధికారులు తెలిపారు. మరోమైపు విగ్రహాల నిమజ్జనాన్ని బట్టి పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలను సడలించనున్నారు. అంటే కొంతవరకూ నిమజ్జనాలు జరిగిన తరువాత ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుంటుంది కాబట్టి ట్రాఫిక్‌ నిబంధనలు సడలించే అవకాశం ఉంటుంది. ఈ  నిమజ్జన వేడుకలు చూసేందుకు వచ్చే భక్తులు తమ వాహనాలను ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఖైరతాబాద్‌,  ఖైరతాబాద్‌ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌, ఆనంద్‌ నగర్‌ జెడ్జీ ఆఫీస్‌, బుద్ధభవన్‌ వెనుక, గోసేవా సదన్‌, లోయర్‌ టాంక్‌ బండ్‌,
కట్టమైసమ్మ టెంపుల్‌, ఎన్టీఆర్‌ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్‌ గార్డెన్‌ పార్కింగ్‌ చేసుకోవాలి. ఈ ట్రాఫిక్‌ ఆంక్షలను ప్రజలు గమనించి ఇబ్బందుల్లో పడకుండా జాగ్రత్త పడాలని పోలీసులుశాఖ సూచించింది.

Other News

Comments are closed.