నేడు పశ్చిమలో చంద్రబాబు పర్యటన

share on facebook

చింతలపూడి, ఏలూరులో బహిరంగ సభలు
ఏలూరు,మార్చి19(జ‌నంసాక్షి): పశ్చిమగోదావరి  జిల్లాలో టిడిపి అధినేత, ఎపి సీఎం చంద్రబాబునాయుడు ఈనెల 20వతేదీన బుధవారం పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చింతలపూడి, ఏలూరులలో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.  బుధవారం  ఉదయం నూజివీడులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అక్కడి నుంచి చింతలపూడి వస్తారు. బహిరంగ సభలో మాట్లాడారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఏలూరు వస్తారు. ఫైర్‌స్టేషను సెంటరులో బహిరంగలో మాట్లాడనున్నారు. అనంతరం రహదారి మార్గాన విజయవాడ వెళ్తారు. దీనికి సంబంధించి పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలావుంటే సిఎం జిల్లా పర్యటన దృష్ట్యా భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రవిప్రకాశ్‌ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇదిలావుంటే జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన 1057 పోలీసు కేంద్రాల్లో 70 చోట్ల మావోయిస్టుల ప్రాబల్యం ఉందని ఎస్పీ వివరించారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నామని, అదనపు బలగాలను రంగంలోకి దింపుతామన్నారు. అక్కడ ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పరిస్థితులు కల్పిస్తామన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూచాతప్పకుండా పాటిస్తామని, ఎన్నికలు సజావుగా జరిగేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. ఎన్నికల నియమావళిని ప్రతీ అభ్యర్థి అనుసరించాలని, అభ్యర్థుల కాన్వాయ్‌లోకి వినియోగించే కార్ల సంఖ్య పరిమితికి మించరాదని సూచించారు. ఒకవేళ ఎక్కువ ఉపయోగిస్తే మైక్రో అబ్జర్వర్‌ వీటిని నమోదు చేసి అభ్యర్థుల ఖర్చులో జమచేస్తారన్నారు.
ఎవరైనా ద్విచక్ర వాహనాలకు, కార్లకు పార్టీ జెండాలను కట్టి తిరగాలంటే కచ్చితంగా రిటర్నింగ్‌ అధికారి అనుమతి పొందాలన్నారు.

Other News

Comments are closed.