నేడు పుష్పయాగంతో పాటు కళ్యాణోత్సవం

share on facebook

కొత్తగూడెం,నవంబర్‌11(జ‌నంసాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని ఈ నెల 12న ఆదివారం నిర్వహిస్తున్నారు. దీంతో పాటు పుష్పసయాగం కూడా నిర్వహిస్తారు. తిరుపతి నుంచి తీసుకొచ్చే ఉత్సవ మూర్తులు, ప్రసాదాలు, కల్యాణ సామాగ్రితోపాటు పుష్పయాగం కూడా చేయనున్నామన్నారు. అత్యంత వైభవంగా జరిగే పుష్పయాగాన్ని, తిరుమలలో వేద పండితుల సాక్షిగా జరిగే క్రతువును ఇక్కడ కూడా అదేవిధంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు కల్యాణ మ¬త్సవ నిర్వాహకులు తెలిపారు. తిరుమలలో జరిగే కల్యాణ మ¬త్సవంలా దీనిని టిటిడి చేపట్టింది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుమల దేవాలయ వేద పండితుల చేతులవిూదుగా కల్యాణ క్రతువు జరగనుందన్నారు. అంగరంగ వైభవంగా కల్యాణాన్ని నిర్వహించనున్నామని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసారు. ప్రత్యేకంగా అన్నమాచార్యుల సంకీర్తనలు, గోవింద నామస్మరణతో కల్యాణ క్రతువును కమనీయంగా తిలకించేందుకు అన్ని ఏర్పాట్లూ చేపట్టారు. క్రతువును తిలకించడానికి భక్తులకు మహదావకాశం కల్పించామన్నారు. భక్తులకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. కల్యాణ దాతలు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కల్యాణాన్ని తిలకించి తరలించాలని కోరారు.

 

Other News

Comments are closed.