నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

share on facebook

ఉట్నూరులో ర్యాలీ సభకు ఏర్పాట్లు

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): నేడు నిర్వహించనున్న ఆదివాసీల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రభుత్వం రెండు లక్షలు మంజూరు చేశారని ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ ఛైర్మన్‌ కనక లక్కేరావు అన్నారు.బలమైన సంస్కృతి, సంప్రదాయాలను కలిగిఉన్న ఆదివాసీలు గురువారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి కృష చేస్తోందన్నారు. అందులో భాగంగా ఆదివాసీల దినోత్సవం సందర్భంగా గురువారం ఉట్నూరులో ర్యాలీ, హెచ్‌కేజీఎన్‌ ఫంక్షన్‌హాల్‌లో బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. ఈ సభలో ఆదివాసీల జీవనవిధానం, పరిస్థితులు, పథకాలు, హక్కులు, చట్టాలపై చర్చిస్తామన్నారు. మొదట ఇక్కడి కొమురం భీం ప్రాంగణంలో సంప్రదాయబద్దంగా పూజ, కుమురం భీం విగ్రహానికి నివాళులరిస్తారన్నారు. ఆదివాసీలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.

 

Other News

Comments are closed.