నేడు మరోమారు  కెసిఆర్‌  జిల్లా పర్యటన

share on facebook


ఆదిలాబాద్‌లో జోగురామన్న తరపున ప్రచారం
భారీగా ఏర్పాట్లు చేసిన నేతలు
ఎవరు వచ్చినా కెసిఆర్‌ను ఢీకొనలేరన్న మంత్రి రామన్న
ఆదిలాబాద్‌,నవబంర్‌28(జనంసాక్షి): ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో అధికార టిఆర్‌ఎస్‌ దూకుడు పెంచింది. ప్రచారంలో దూసుకుని పోతోంది.  జిల్లాలో ఇప్పటికే ఓ విడత ఎన్నికల ప్రచారం చేసిన ముఖ్యమంత్రి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోమారు గురువారం ఆదిలాబాద్‌కు రానున్నారు. ఇచ్చోడలో ఈ నెల 22న జరిగిన బహిరంగసభలో ముఖ్యమంత్రి పాల్గొని బోథ్‌ నియోజకవర్గ అభ్యర్థి రాథోడ్‌ బాపురావు తరఫున ప్రచారం చేశారు. రెండో విడత ప్రచారంలో భాగంగా గురువారం  జిల్లా కేంద్రానికి రానున్నారు. ఆదిలాబాద్‌ బహిరంగ సభ అనంతరం సీఎం కుమ్రం భీం ఆసిపాబాద్‌ జిల్లాలో ప్రచారానికి బయలుదేరుతారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జోగు రామన్న తరఫున ప్రచారం చేయనున్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 11 గంటలను ఆదిలాబాద్‌ చేరుకొంటారు. ముఖ్యమంత్రి బహిరంగ సభకు అధికారులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేసారు. దాదాపు 50 వేల మంది హాజరయ్యేలా టీఆర్‌ఎస్‌ నాయకులు చర్యలు తీసుకొంటున్నారు.  ఆదిలాబాద్‌ అర్బన్‌, ఆదిలాబాద్‌ రూరల్‌, మావల, బేల, జైనథ్‌ మండలాలను నుంచి భారీగా జనసవిూకరణ చేయాలని నిర్ణయించారు.  ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో మంత్రి రామన్న ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆయన రెండో విడత ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనాన్ని మహా కూటమి, బీజేపీ ఆపలేవని  మంత్రి జోగు రామన్న అన్నారు.  ప్రచారానికి కూటమి తరపున చంద్రబాబు, రాహుల్‌ గాంధీ వచ్చినా.. బీజేపీ తరపున నరేంద్ర మోదీ, అమిత్‌ షా వచ్చినా రాష్ట్రంలో కేసీఆర్‌ను ఓడించలేరన్నారు.
టీఆర్‌ఎస్‌కు రాష్ట్ర ప్రజల అండదండలున్నాయన్నారు. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. ప్రధాని మోడీ ఇచ్చిన హావిూలను విస్మరించి ప్రజలను మోసం చేశారన్నారు. ఆ పార్టీలకు ఓట్లు అడిగే నైతికహక్కు లేదన్నారు. నాలుగేండ్లలో జరిగిన ప్రగతిని వివరించేందుకు సీఎం కేసీఆర్‌ గురువారం జిల్లాకేంద్రానికి వస్తున్నారని తెలిపారు. మహిళలు, యువకులు, కార్మికులు, కర్షకులు, ప్రజా సంఘాల నాయకులు బహిరంగ సభను విజయవంతం చేయాలని
కోరారు.

Other News

Comments are closed.