నేడు ముఖ్యకార్యకర్తలతో సవిూక్ష: రాజయ్య

share on facebook

జనగామ,అక్టోబర్‌20(జ‌నంసాక్షి):  ఈ నెల 21న నిర్వహించే ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి కేటీఆర్‌ రానున్నట్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య చెప్పారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డాక్టర్‌ బండ ప్రకాశ్‌, ఎంపీ పసునూరి దయాకర్‌ హాజరవుతారని, సమావేశాన్ని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని ఆయన కోరారు. దేశంలోనే నంబర్‌ వన్‌ స్ధానంలో తెలంగాణ రాష్ట్రం ఉందని, అందుకు సీఎం కేసీఆర్‌కే ఆఘనత దక్కిందని తాజా అన్నారు.  సీఎం కేసీఆర్‌ తన ను ఆశ్వీదించి పార్టీ టికెట్‌ కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. రైతుబంధు పథకం కింద రూ.82 కోట్లు పంపిణీ చేశామని, ఈ యాసంగిలో రైతులకు నేరుగా బ్యాంకులలో డబ్బులు జమ అవుతాయన్నా రు. మహిళ గ్రూపులకు రుణాల కింద రూ. 17 వేల కో ట్లు మాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే ద క్కుతుందన్నారు. నియోజకవర్గం లో రూ.390 కోట్లతో పీఆర్‌, ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులను పూర్తి చేశామని ఆయన తెలిపారు. కుడా పరిధిలో స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ పరిధిలో కొన్ని గ్రామాలు ఉన్నందున ఆ గ్రామాల అభివృద్ధికి రూ.2 కోట్ల 50 లక్షలు మంజూరయ్యాయన్నారు. అదనంగా నియోజకవర్గ అభివృద్ధికి రూ. 170 కోట్ల నిధు లు వచ్చాయని, ఎన్నికల అనంతరం పనులు జరుగుతాయన్నారు.

Other News

Comments are closed.