నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం

share on facebook

-పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి

కరీంనగర్‌,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): నేరాల నియంత్రణకు ఆదునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని కరీంనగర్‌ పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆక్రమ కార్యకలాపాలు జరిగే ప్రాంతాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గుర్తించి నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తూ, నియంత్రిస్తున్నామని పేర్కొన్నారు. నగరంలోని కాపువాడ మేదరివాడ, పాతబజార్‌ ప్రాంతాల్లో గురువారం పోలీస్‌లు కార్డన్‌ అండ్‌ సర్చ్‌ నిర్వహించారు. వివిద ¬టళ్లు, కిరాణ దుఖాణాలు ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. అపరిశుభ్రమైన వాతావరణంలో మరిగిన నూనెలతో తినుబండారాలను తయారు చేస్తున్న కేంద్రంపై దాడి జరిపి సీజ్‌ చేశారు. కిరాణం దుకాణంలో సోదా నిర్వహించగా గడువు తీరిన చిన్న పిల్లలు తినే తిను బండారాలు బయట పడ్డాయి. ఈసందర్బంగా కవిూషనర్‌ కాలనీ వాసులతో మాట్లాడుతూ నేరాల నియంత్రణలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ఆక్రమ కార్యకలాపాలకు సంబందించించిన సమాచారం అందించే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజల సౌకర్యార్థం రూపొందించిన హాక్‌ఐ యాప్‌ను స్మార్ట్‌ ఫోన్‌ కలిగిన ప్రతి వ్యక్తి డౌన్‌ లోడ్‌ చేసుకోవాలన్నారు. ఎలాంటి సమాచారాన్నైనా పోలీస్‌ స్టేషన్‌లు రాకుండా సమాచారం అందించే సౌకర్యం ఈ యాప్‌లో ఉందన్నారు. ఆపద సమయాల్లో మహిళల భద్రత కోసం ప్రత్యేక సదుపాయం ఉందన్నారు అనేక రకమైన తినుబండారాలు అపరిశుభ్రమైన వాతావరణంలో మరిగిన నూనెలతో తయారవుతున్నాయని నాణ్యతలేని గడువుతీరిన తినుబండారాలు తినకూడదన్నారు. అపరిశుభ్రమైన వాతావరణంలో తయారవుతున్న తినుబండారాలతో క్యాన్సర్‌ వ్యాది బారిన పడే ప్రమాదం ఉందన్నారు నేరాల నియంత్రణ చేదన కోసం సిసి కెమెరాలు దోహదపడుతున్నాయని నేను సైతం కార్యక్రమంలో బాగంగా సిసి కెమరాల ఏర్పాటుఏకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలన్నారు. వాహనాలు కొనుగోలు చేసిన సందర్బంలో వాహనదారులు తమ పేరిట దృవపత్రాలను ఏర్పాటు చేసుకోవాలని లేనట్లయితే ప్రమాదాలు దొంగతనాలు జరిగిన సందర్బాలలో ఇబ్బందులు ఏర్పడుతాయని తెలిపారు. అసాంఘీక కార్యకలాపాల నియంత్రణకు డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తున్నామన్నారు. డ్రోన్‌ కెమెరాల వినియోగం ద్వారా సత్పలితాలు వస్తున్నాయన్నారు, పోలీస్‌లు వినియోగిస్తున్న అదునాతన సాంకేతికపరికరాలు డ్రోన్‌ కెమరాలు ఫింగర్‌ ప్రింట్‌ డివైజ్‌ బాడీ వార్న్‌ కెమరాలు గార్డియన్‌ ఏంజిల్స్‌ ట్రాఫిక్‌ బ్యాటన్స్‌ ఎల్‌ఈగి లైట్లు బైనాక్యులర్‌ లాంటి పలు పరికరలాను ఈసందర్బంగా ప్రదర్శించారు. సరైన దృవపత్రాలు లేని 63 ద్విచక్ర వాహనాలు నాలుగు ఆటోలు గడువు తీరిన తినుబండారాలు గుట్కా అల్ల వెల్లుల్లి పేస్ట్‌లను స్వాదీనం చేసుకున్నారు. ఈకార్యక్రమంలో ఎసిపి రామారావు, ఇన్స్‌పెక్టర్‌లు తుల శ్రీనివాసరావు, మహేశ్‌ గౌడ్‌, విజయ్‌ కుమార్‌, రవి క్యూఆర్టి టాస్క్‌ఫోర్స్‌ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ విబాగాలకు చెందిన 200 మంది పోలీస్‌లు పాల్గొన్నారు.

Other News

Comments are closed.