న‌డిరోడ్డుపై న‌రికేశారు

share on facebook

ఎర్రగడ్డ మెయిన్‌రోడ్డుపై ప్రేమజంటపై కత్తితో దాడి

హైదరాబాద్ : మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య ఘటన మరువకముందే నగరంలోని ఎర్రగడ్డలో మరో పరువు హత్య చోటు చేసుకుంది. ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వద్ద ప్రేమ వివాహం చేసుకున్న జంటపై అమ్మాయి తండ్రి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిద్దరిని చికిత్స నిమిత్తం సనత్‌నగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Other News

Comments are closed.