పంచాయితీ ఎన్నికలపై ప్రభుత్వానికి స్పష్టత లేదు

share on facebook

మాజీ ఎమ్మెల్యే శశిధర్‌ రెడ్డి

మెదక్‌,జూలై12(జ‌నం సాక్షి): పంచాయితీ ఎన్నికలపై ప్రభుత్వానికి స్పష్టత లేదని, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని పిసిసి అధికార ప్రతినిధి,మెదక్‌ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తే తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఉత్తమ్‌ మండిపడ్డారు. రిజర్వేషన్లపై

స్పష్టత ఇవ్వకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎవరో హైకోర్టులో కేసు వేస్తే ప్రభుత్వం తరఫున సరిగా వాదనలు వినిపించలేక తమపై నెపం మోపుతున్నారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం ముందుగా ఒక అవగాహనకు రావాలని, స్పష్టమైన విధానం ప్రకటించాలని అన్నారు. ప్రతిపక్ష పార్టీలను అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేసి చర్చ లేకుండా పంచాయతీరాజ్‌ చట్టం బిల్లు ఆమోదింపజేసుకున్నారు. చర్చ జరిగి ఉంటే ఆనాడే రిజర్వేషన్లపై స్పస్టత వచ్చేదని అన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, అఖిలపక్షం ఏర్పాటు చేసి ఈ విషయంపై చర్చించాలన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు అమలు

చేయాలన్నదే కాంగ్రెస్‌ డిమాండ్‌ అన్నారు. ఇకపోతే కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలు పేదలకు శాపంగా మారాయన్నారు. పెద్దనోట్ల రద్దు తరవాత రాష్ట్రంలో గ్రావిూణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని తెలిపారు. గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.రద్దును తాము వ్యతిరేకించినట్లే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రద్దువల్ల కలిగే విపరిణామాలపై ప్రభుత్వానికి స్పష్టత లేకపోవడం వల్లనే ఆందోళన వ్యక్తం చేస్తున్నామని అన్నారు. నగదు రహిత లావాదేవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నా అవి కూడా ప్రజలపై భారం మోపుతున్నాయని అన్నారు. ప్రభుత్వ వ్యవహారాలను నగదురహితంగా మార్చామని చెప్పుకోవడం పక్కన పెట్టి, పెద్దనోట్ల రద్దు కారణంగా మార్కెట్‌ వ్యవస్థ ఎంతగా దెబ్బతిన్నదో గుర్తించాలని అన్నారు.

 

Other News

Comments are closed.