పంచాయితీ కార్మికుల ఆందోళన

share on facebook

నల్గొండ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): నాగర్జన సాగర్‌ నియోజకవర్గం హాలియాలో గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. నెలకు 25000 రూపయలవేతనం చెల్లించాలిని అలాగే ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలను బీమా సౌకర్యం భద్రతను కల్పించి ప్రభుత్వం తమ చిత్తశు ద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు . ఈ మేరకు కార్మికుల చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్‌ నియోజకవర్గ అధ్యక్షుడు మనాది రవి యాదవ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు చన్ను వెంకటనారాయణరెడ్డి నెమలి రంగారెడ్డి దీఎ/-లానాయక్‌ బూడిద విజయ్‌ వెంకట్‌ రెడ్డి శ్రీన్‌ నాయక్‌ లచ్చునాయక్‌ తదితరులు పాల్గొన్నారు .ఏళ్ల తరబడి గ్రామపంచాయతీ కార్మికుల శ్రమను దోచుకుంటూ కనీస వేతనం చెల్లించకుండా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా తెలంగాణ ప్రభుత్వం వారిని చిన్నచూపు చూస్తుందని ఎద్దేవా చేశారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని వారి కోరారు

 

Other News

Comments are closed.