పంచాయితీ కార్మికుల భిక్షాటన

share on facebook

భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): సమస్యల పరిష్కరం కోసం అశ్వరావు పేట పరిధిలోని పంచాయతీ కార్మికులు గత 17 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వ వైఖరికి నిరసనగా భిక్షాటన నిర్వహించారు. పంచాయతీ కార్మికులు పట్టణంలోని దుకాణాలు తిరుగుతూ ప్రభుత్వ వైఖరిని వివరిస్తూ తమకు మద్దతు తెలపాలని ప్రజలను అభ్యర్థించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు కామేశ్‌, నందు, నాగేశ్వరరావు, నర్సింహారావు, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Other News

Comments are closed.