పంటలకు మద్దతు ధరలపై అవగాహన 

share on facebook

నల్లగొండ,మే4(జ‌నంసాక్షి): రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పించేందుకు గ్రామ రైతు సమాఖ్య సమితులు రైతులకు అవగాహన కల్పిస్తాయని వ్యవసాయాధికారులు అన్నారు. ఆగ్రోప్రాసెస్‌ యూనిట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రైతుల ఆత్మహత్యలు నిరోధించడానికి రైతుల సమస్యలు పరిష్కరించి, రైతుల ఆర్‌థ్ధికస్థితిగతులను మెరుగు పర్చేందుకు ప్రభు త్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  గతంలో రైతులకు ఎరువుల కొరత ఉండేదని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రైతులపై ఎక్కువ శ్రద్ధ చూపడం వల్ల ముందుగానే ఎరువులను అందుబాటులో ఉంచడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో రైతులు పండించిన పంటలకు మద్దతు దక్కేలా రైతు సమాఖ్య సభ్యులు చూడాలని అన్నారు. రైతులు ధాన్యాన్ని ఐకేపీ, సొసైటీ సెంటర్లకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని, ఇతర రాష్ట్రాల రైతులు ధాన్యా న్ని మనరాష్ట్రంలో అమ్మేందుకు ప్రయత్నించడం వల్ల మన రైతులకు గిట్టుబాటు ధర అందడంలేదని, దీనిని నిరోధించేందుకు చర్యలు చేపడతామన్నారు. రైతుకు ముందుగా కావల్సిన విత్తనాలను గ్రామస్థాయిలో ఎవరు అమ్ముతున్నారు. అవి నకిలీవా, మంచివా అనేది కూడా గ్రామస్థాయి రైతు సమాఖ్య సభ్యులు పరిశీలించి రైతులకు తెలియజేయాలన్నారు.

Other News

Comments are closed.