పట్టణవాసుల ఓట్లపై అభ్యర్థుల గురి

share on facebook

మధ్యవర్తుల ద్వారా రాయబేరాలు

గ్రామాలకు రప్పించేందుకు ఏర్పాట్లు

నిజామాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి): తొలివిడతలో వివిధ పట్టణఱాల్లో స్థిరపడ్డవారు వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటేసి వెళ్లారు. వారి ఓట్లు విజయంలో కీలకంగా మారాయి. ఒక్కో గ్రామంలో కనీసం ఓ 50 మంది వరకు ఓటేసినట్లు సమాచారం. ఇప్పుడు రెండు,మూడో విడత ఓట్ల కోసం కూడా పట్టణాల్లో స్థిరపడ్డ వారిని రప్పించే యత్నాల్లో ఉన్నారు. ఓటు వేసేందుకు గ్రామలకు వచ్చే వారికి ఐదు వందల నోటుతో పాటు మందుతో పసందైన విందు భోజనం ఏర్పాటు చేస్తామని సర్పంచు అభ్యర్థులు హావిూ ఇస్తున్నారు. ప్రయాణం ఖర్చుల కోసం ఒక ఓటుకు ఐదు వందలు ఇచ్చేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రతి గ్రామం నుంచి కనీసం ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు ఇలా ఇచ్చేందుకు ముందుకు వస్తుండడంతో ఓటర్లు సైతం గ్రామాలకు వచ్చేందుకు ఆసక్తిని కనబరుస్తున్నట్లు సమాచారం. కొందరు అభ్యర్థులు తమ అనుచరులను అక్కడికి పంపించి నేరుగా పోలింగ్‌ కేంద్రానికి తీ సుకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే ఆరు మండలాల పరిధిలో ఓటర్లు సుమారు నాలుగు వేల మందికి పైగా పట్నంలో ఉంటున్నారు. ముఖ్యంగా జిల్లాలోని నాగిరెడ్డి పేట, ఎల్లారెడ్డి మండలాల నుంచి కనీసం రెండువేల మంది, లింగంపేట, గాంధారి, నిజాంసాగర్‌, పిట్లం మండలాల నుంచి మరో రెండువేల మందికి పైగా బతు కుదెరువు కోసం పట్నంలో నివాసముంటున్నారు. వీరి ఓట్లు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కీలకం కావడంతో సర్పంచు అభ్యర్థులు రాత్రికి రాత్రి అక్కడికి వెళ్లి వారంతా గ్రామాలకు వచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు వారికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా రాజధానిలోని కూకట్‌ పల్లి, మియపూర్‌, బాలానగర్‌, యాప్రాల్‌, హైటెక్‌ సిటీ ప్రాంతాల్లో ఉంటన్న వారిని పలు సర్పంచు అభ్యర్థులు అక్కడి వెళ్లి కలిసి వస్తున్నారు. సర్పంచు అభ్యర్తులు ఇక్కడ

బిజీగా ఉండడంతో వారి కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులు రాజధానికి వెళ్లి తమ అభ్యర్థికే ఓటు వేయాలని ప్రచారం చేసి వస్తున్నారు. ఒక్కో ప్రాంతలో ఉండే వారిని వేరు వేరుగా కలిసి డబ్బులు పంపిణీ చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి సర్పంచు అభ్యర్థులు ప్రత్యేకంగా భోజనాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటు వేయగానే భోజనం చేసి రాజధానికి తీసుకెళ్లేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీన జరుగనున్న రెండో విడత ఎన్నికకు బుధవారం సాయంత్రం ప్రచార గడువు ఉండడంతో ఇక హైదరాబాద్‌ ఉంటున్న ప్లలె ఓటర్ల వైపు దృష్టిని మరింత సారించాలని అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు.

Other News

Comments are closed.