పత్తికొనుగోళ్లకు సిసిఐ సిద్దం

share on facebook

గుంటూరు,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): రాష్ట్రంలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నారు. ఇందుకోసం గుంటూరు, కృష్ణా, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొనుగోళ్లలో అక్రమాలకు తావుండకుండా ఏర్పాట్లు చేశారు. 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెప్పారు. కొనుగోళ్లకు సర్వం సిద్ధం చేసినట్టు వెల్లడించారు. ఇదిలావుంటే నకిలీల విత్తనాలతో రైతులను మోసగిస్తున్న సంస్థలపై పీడీ చట్టం ప్రయోగించి చర్య తీసుకుంటామని అన్నారు. రైతుల ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తూ ధాన్యం కొనుగోలు చేస్తున్నాని, కొన్న ధాన్యానికి 48 గంటల్లోనే రైతులకు సొమ్ము చెల్లించామని వివరించారు. వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మలిచి రైతుల ఆదాయాలను పెంచడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమన్నారు.

Other News

Comments are closed.