పథకాల అమలులో ముందున్నాం

share on facebook

జగిత్యాల,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని జగిత్యాల టిఆర్‌ఎస్‌ నేత డాక్టర్‌ సంజయ్‌ అన్నారు. ఉద్యమ స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధనలో మమేకం కావాలని అన్నారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలోనే రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో నిలిపామన్నారు. మహిళలకు, యువతులకు భద్రతగా షీటీమ్‌లను ప్రారంభించిన ఘనత ప్రభుత్వానిదేనన్నారు. మాది చేతల ప్రభుత్వమని, ఆంధ్రా పాలకుల ఆరోపణలు పటాపంచలు చేస్తూ కరెంటు కోతలను అధిగమించామన్నారు. సంక్షేమ పథకాల అమలుతో ప్రభుత్వం కన్నతల్లి పాత్రను పోషిస్తుందని, దళితుల సంక్షేమమే ఎజెండాగా పని చేస్తాన న్నారు. బంగారు తెలంగాణ సాధనలో ప్రతీఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు.

 

Other News

Comments are closed.