పర్యాటక ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించాలి

share on facebook

ఆదిలాబాద్‌,జూలై11(జ‌నం సాక్షి): జిల్లాలో పర్యాటక ప్రాంతాలను గుర్తించి అభివృద్ది చేయాల్సి ఉంది. దీంతో పర్యాక కేంద్రాల ద్వారా ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశాల ఉన్నారు. ఇటీవల కురుస్తోన్న వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లోకివరద నీరు వచ్చి చేరుతున్నది. నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం, భీంపూర్‌ మండలంలోని గుంజాల, బోథ్‌ మండలంలోని పొచ్చెర జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. జలపాతాల వద్ద పర్యాటకుల సందడి కనిపించింది. సెల్ఫీలు తీసుకుంటూ అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. రాకపోకలతో పాటు ఇక్కడ సౌకర్యలతో పాటు, రక్షణ చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. ముఖ్యంగా జంటలుగా వచ్చే వారికి రక్షణ చర్యలు అవసరం. జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరట్వాడ ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతం విూదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని ప్రాజెక్టుల్లో వరద నీరు వచ్చి చేరుతున్నది.

 

Other News

Comments are closed.