పర్యావరణ హితాన్ని మరవద్దు

share on facebook

శబ్ద,వాయు కాలుష్యాలతో జాగ్రత్తలు తీసుకోవాలి

హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): దీపావళి అంటే బాణసంచా కాల్చడం, చెవులు ¬రెత్తే విధంగా టపాసులు పేల్చడం ఎక్కువయ్యాయి. దీంతో శబ్ధ, వాయి కాలుష్యంతో పాటు తరచూ ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇది కాదు మన సంప్రదాయం కాకున్నా దీనికి అలవాటు పడ్డాం. పండగ రోజున కాలుష్యకారకాలను పెంచే కన్నా పర్యావరణ హితానికి మొక్కలు పెంచడం అలవాటు చేసుకోవాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఇంటింటికి మొక్కలు పెంచాలని పిలుపునిద్దాం. చిచ్చుబుడ్డి, తాటాకులతో తయారు చేసిన టపాకాయలు, కుమ్మర్లు తయారు చేసిన చిచ్చుబుడ్లు, భూ చక్రాలు, విష్ణు చక్రాలు, హావాయి, చువాయిలు ఉండేవి. ఇప్పటి మాదిరే పూర్వం చిచ్చుబుడ్లు ఉండేవి. కాని అవి కుమ్మరి తయారు చేసినవి. కుమ్మర్ల మట్టితో తయారు చేసేవారు. వీటి తయారీలో భాస్వరం, గంధకం వాడేవారు. భాస్వరం చిచ్చుబుడ్లలో ఎక్కువగా ఉంటే, మతాబుల్లో గంధకంతో కూడిన మండే పదార్థాలు ఉండేవి. నేల విూద కొడితే పేలే టపాకాయలను ఎక్కువగా వినియోగించేవారు. భూచక్రం, విష్ణు చక్రం, కాకర పువ్వొత్తులు

భాస్వరంతో తయారు అయ్యేవి. ప్రస్తుతం పేకాటకు ఉపయోగించే అట్టలతో తయారు చేసిన పేక ముక్కలతో హవాయి, చువాయిలు ఇంట్లోనే తయారు చేసుకుని వాటిని కాల్చేవారు. ఈ టపాసులు అన్నింటితో పర్యావరణానికి ఎటువంటి ముప్పు ఉండేది కాదు. గంధకం, భాస్వరంతో కొద్ది రోజుల పాటు దోమలు, క్రిమి కీటకాలు అనేవి కనిపించేవి కావు. ఇంతటి పరమార్థాన్ని బోధించే ఈ పండగలో ఇవాళ దీపాల కంటే మందుగుండు సామగ్రి ప్రధానం అయిపోయింది. పూర్వీకులు అమృత పాత్రల్లాంటి ఆచారాలని అందిస్తే అజ్ఞానంతో వాటిని ఇతర రూపాల్లోకి మార్చేశాం. కాలక్రమంలో బాణసంచా పుట్టి ఇప్పుడు బాంబుల సంతగా మారి భయపెడుతోంది. టపాసులు పేల్చడం వల్ల ఆ శబ్ధాలకు పక్షులు, కుక్కలు, జంతు జాతులు ఉక్కిరిబిక్కరవుతూ మృత్యువాత పడతాయి. వాటి సంరక్షణ నిమిత్తం భారీ శబ్ధాలతో కూడిన టపాసులకు దూరంగా ఉండాలని సూచించారు. వీధులు, కాలనీలు, అపార్ట్‌మెంట్ల వద్ద ప్రజలకు పర్యావరణహిత దీపావళి పండగ ప్రత్యేకతను తెలియజేయాలన్నారు. ఇంతటి ఉన్నతమైన పండగ నాడు కాలుష్యానికి మూలభూతం అయిన టపాసులను ఎక్కువ సంఖ్యలో వాడటం శ్రేయస్కరం కాదన్నారు.

దీపావళి నాటి దీపకాంతిని చూస్తే ఎంత ముచ్చటేస్తుందో… టపాసుల శబ్ద కాలుష్యానికి అంతగానూ ఇబ్బంది కలుగుతుంది..శబ్ద కాలుష్యం వల్ల శాశ్వత వినికిడి లోపం.. రక్తపోటు.. గుండె జబ్బులు, నిద్రలేమి,

రోగ నిరోధక శక్తి తగ్గడం, పుట్టుక లోపాలు తదితర సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ఈ శబ్దం ఒత్తిడికి దారి తీస్తుంది. రోడ్డు ప్రమాదాలు పెరుగుతాయి. మతిస్థిమితం కోల్పోయే ప్రమాదమూ ఉంది. పెంపుడు జంతువులు శబ్దాలకు విచిత్రంగా ప్రవర్తిస్తాయి. టపాసుల తయారీలో కాపర్‌, కాడ్మియం, సీసం, మెగ్నీషియం, సీసం, జింక్‌, సోడియం, అల్యూమినియం, అమ్మోనియం, పొటాషియం, సల్ఫర్‌, బొగ్గు తదితర రసాయనాలను వినియోగిస్తారు. యాంటీమొనీ సల్ఫేడ్‌, బేరియం నైట్రేట్‌ మండటం వల్ల వెలువడే పొగ విషతుల్యం.. దాన్ని ఎక్కువ సేపు పీలిస్తే కోమాలోకి వెళ్లే ప్రమాదముంటుంది. కాపర్‌ వల్ల వెలువడే పాలీ క్లోరినేటెడ్‌ డయాక్సిన్లు, డై బెంజో ప్యూరాన్లు క్యాన్సర్‌కు కారణమవుతాయి. లిథియం వల్ల వెలువడే పొగ చర్మ సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. పొటాషియం నైట్రేట్‌ వల్ల విష పూరితమైన దుమ్ము, సల్ఫర్‌ విడుదలవుతుంది. సల్ఫర్‌డయాక్సైడ్‌ వల్ల ఆస్తమా, దగ్గు, పిల్లి కూతలు వస్తాయి. నైట్రస్‌ ఆక్సైడ్‌ వల్ల గొంతు, కళ్లు, ముక్కు సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని మనం బాణాసంచా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలన్నారు.

 

 

Other News

Comments are closed.