పవన్‌ తీరుకు నిరసనగా జర్నలిస్టుల ఆందోళన

share on facebook

దాడులను ఖండించిన ఐజెయూ నేతలు
హైదరాబాద్‌/విజయవాడ,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి):  నగరంలోని బెంజ్‌ సర్కిల్‌ వద్ద శనివారం జర్నలిస్టుల ఆందోళన చేపట్టారు. విూడియా వాహనాలపై దాడి, విూడియాపై పవన్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ జర్నలిస్టు సంఘాలు, ఉద్యోగ సంఘాల ఆందోళన చేపట్టాయి. బాధ్యత గల రాజకీయ నాయకుడిగా అభిమానుల నియంత్రించాల్సిన బాధ్యత పవన్‌దేనని జర్నలిస్టులు అన్నారు. కొన్ని విూడియా సంస్థలను… బ్యాన్‌ చేయాలన్న పవన్‌ వ్యాఖ్యలు సరికాదని జర్నలిస్టు సంఘాలు విమర్శించాయి. కవరేజ్‌కు వచ్చిన సంస్థలపై దాడులు గర్హనీయమని అన్నారు. విూడియాపై పవన్‌ అభిమానుల దాడికి నిరసనగా బెంజ్‌సర్కిల్‌లో జర్నలిస్టుల ఆందోళన చేపట్టారు. ఆందోళనలో అన్ని జర్నలిస్టు, ఉద్యోగ సంఘాలు పాల్గొన్నారు. పవన్‌ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. విూరు విూ సైనికులతో పోరాటం చేస్తే… మేం అక్షరాలతో పోరాటం చేస్తామని పవన్‌ కల్యాణ్‌ ను ఉద్దేశించి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు వ్యాఖ్యానించారు. ఇందిరాగాంధీ కంటే విూరు మొనగాళ్లు కాదని ఏపీజేఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణాంజనేయులు అన్నారు. ఇందిర ఎమర్జెన్సీ పెట్టి ఉపసంహరించుకున్నారని ఆయన గుర్తుచేశారు. విూడియాపై నిర్బంధం సాగదని ఆయన చెప్పారు. విూడియాపై దాడులను ఐక్యంగా తిప్పికొట్టాలని ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు చలపతిరావు, యూనియన్‌ నేత జయరాజు, బ్రహ్మయ్య, ఏపీ ఫోటో జర్నలిస్టు అసోసియోషన్‌ పేర్కొన్నాయి. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభిమానులు దాడి చేయడం సరికాదని ఐజేయూ మాజీ సెక్రటరీ జనరల్‌ కె. శ్రీనివారెడ్డి అన్నారు. విూడియాపై దాడి ఆత్మహత్యా సదృశ్యం అని అన్నారు. దాడి పట్ల పవన్‌ తక్షణమే ప్రకటన చేయాలని శ్రీనివాసరెడ్డి డిమాండ్‌ చేశారు. రాజకీయంలో వచ్చిన నాయకుడు చాలా బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. విూడియా సంస్థలపై జరిగిన దాడి సరికాదని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. విూడియాను విమర్శించడానికి అనేక మార్గాలు ఉన్నాయన్నారు. పవన్‌కు ఇది గుణపాఠం కావాలని, పవన్‌ తీరు ఇలాగే ఉంటే రాజకీయాల్లో గౌరవం ఉండదని ఆయన అన్నారు.  విూడియా స్వేచ్ఛను నియంత్రించకూడదని ప్రెస్‌కౌన్సిల్‌ సభ్యుడు దేవులపల్లి అమర్‌ అన్నారు. విూడియా విధుల్లో రాజకీయపక్షాల జోక్యం సరికాదని ఆయన చెప్పారు. నిరాధార వార్తలపై కోర్టుల ద్వారా తేల్చుకోవాలని సూచించారు. విూడియాపై భౌతిక దాడులు, ఆస్తుల ధ్వంసం సరికాదన్నారు. సినిమా, విూడియా, రాజకీయాల మధ్య హద్దులు చెరిగిపోయాయని అమర్‌ పేర్కొన్నారు.

Other News

Comments are closed.