పాక్‌లో సిక్కుబాలిక కిడ్నాప్‌

share on facebook

మతం మార్చి పెళ్లి చేసుకున్న దుండగుడు
నిరసనలతో అరెస్ట్‌..దర్యాప్తు ముమ్మరం
ఇస్లామాబాద్‌,ఆగస్ట్‌31 ( జనంసాక్షి  ) :   సిక్కు బాలికను కిడ్నాప్‌ చేసి తీసుకువెళ్లి ఆమెను ఇస్లాం మతంలోకి మార్చి ముస్లిమ్‌ యువకుడు పెళ్లాడిన ఘటనపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం కావడంతో పాకిస్థాన్‌
పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. సిక్కు బాలిక జగ్జీత్‌ కౌర్‌ ను తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం ఈ కేసులో నిందితులైన 8మందిని పాక్‌ పోలీసులు అరెస్టు చేశారు. లా¬ర్‌లోని నంకన సాహిబ్‌ ప్రాంతంలో ఉన్న గురుద్వారాలో గ్రంథి(ప్రబోధకుడి)గా పనిచేస్తున్న భగవాన్‌సింగ్‌ కుమార్తె జగ్జీత్‌ కౌర్‌(17)ను కొద్ది రోజుల కిందట అపహరించారు. అనంతరం ఆమెను బలవంతంగా మతం మార్చి ముస్లిం యువకుడు మహ్మద్‌ ఎహ్‌సాన్‌తో పెళ్లి జరిపించారు. జగ్జీత్‌ కౌర్‌ పేరును అయేషాగా మార్చిన ఓ మౌల్వి.. దగ్గరుండి పెళ్లి జరిపించిన వీడియో వైరల్‌గా మారింది.ఈ ఘటనపై స్థానిక పోలీసులకు బాలిక సోదరుడు మన్మోహన్‌సింగ్‌ ఫిర్యాదు చేశాడు. తమకు న్యాయం చేయాలంటూ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు బాధిత కుటుంబం విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించిన వీడియోను శిరోమణి అకాలీదళ్‌ అధికార ప్రతినిధి మం జీందర్‌ సోషల్‌ విూడియాలో షేర్‌ చేశారు.శిరోమణి అకాలీదళ్‌ ఎమ్మెల్యే మంజిందర్‌ సింగ్‌ తోపాటు ప్రపంచవ్యాప్తంగా సిక్కు సంఘాలు చేసిన ఆందోళనలతో దిగి వచ్చిన పాక్‌ పోలీసులు 8 మంది నిందితులను అరెస్టు చేశారు. సిక్కు బాలిక జగ్జీత్‌ కౌర్‌ ను సురక్షితంగా ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.

Other News

Comments are closed.