పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌కు తప్పిన ముప్పు

share on facebook

పీటర్‌ సిడిల్‌ బౌన్సర్‌తో తలకు గాయం
దుబాయ్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మైదానంలో బ్యాటింగ్‌ చేస్తుండగా బౌలర్‌ విసిరిన బంతి నేరుగా అతని హెల్మెట్‌కు బలంగా తాకింది. ఐతే గాయాలేవిూ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన అబుదాబిలో ఆస్టేట్రియాతో రెండో టెస్టు మ్యాచ్‌ మూడో రోజులో చోటుచేసుకుంది. గురువారం పాక్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్‌ 33 పరుగులతో క్రీజులో బ్యాటింగ్‌ చేస్తుండగా ఆస్టేల్రియా  బౌలర్‌ పీటర్‌ సిడిల్‌ వేసిన బౌన్సర్‌ అతని తలకు తాకింది. నొప్పిని తట్టుకొని 81 పరుగులు సాధించాడు. తర్వాతి రోజు శుక్రవారం ఉదయం నిద్రనుంచి లేవగానే తీవ్రమైన తలనొప్పిగా ఉన్నందని సర్ఫరాజ్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ దృష్టికి తీసుకెళ్లాడు. ముందస్తు చర్యగా అతని తలకు స్కానింగులు తీస్తున్నట్లు వెల్లడించింది. వికెట్‌ కీపర్‌ సర్ఫరాజ్‌ అస్వస్థతకు గురికావడంతోనే అతడు నాలుగో రోజు ఆటకు దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో మహ్మద్‌ రిజ్వాన్‌ వికెట్‌ కీపర్‌ బాధ్యతలు చేపట్టగా.. అసద్‌ షఫీక్‌ తాత్కాలిక కెప్టెన్సీగా వ్యవహరిస్తున్నాడు.

Other News

Comments are closed.