పాఠశాల ప్రహారీలకు ప్రత్యేక నిధులు

share on facebook

మెదక్‌,జూలై12(జ‌నం సాక్షి): నర్సాపూర్‌ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో హరితహారం మొక్కలతో పాటు పాఠశాలలకు రక్షణ లేదన్న విషయం తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. ఇందుకోసం నిధులు విడుదల చేయిస్తానని అన్నారు. త్వరలోనే ఆ నిధులు సైతం మంజూరు అవుతాయని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలకు సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలకు త్వరలోనే ప్రత్యేక నిధులు మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎంపీటీసీలు ఎన్నికైన నాటి నుంచి వారికి ఎలాంటి నిధులు లేక, పనులు జరుగక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మంజూరు కానున్న నిధుల్లో వారికి ప్రత్యేక కోటా ఏర్పాటు చేసి, నిధులనుమంజూరు చేసి వారి గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేయనున్నామన్నారు. అలాగే విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాయకులు సమస్యలు తమ దృష్టికి తెచ్చారని, సంబంధిత అధికారులతో కలిసి అన్ని పాఠశాలల ప్రహరీలకు రూ. 14 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి అందించామన్నారు.

 

Other News

Comments are closed.