పాడిపరిశ్రమపై దృష్టి పెట్టాలి  

share on facebook

వరంగల్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): జిల్లాలలోని నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి శిక్షణ కల్పించడంతోపాటు ఉపాధి చూపించే విదంగా శిక్షణా కార్యక్రమాలను అమలు చేసేందుకు కార్యాచరణ సిద్దం చేసారు. పాడి పరిశ్రమ, హార్టికల్చర్‌, సెరికల్చర్‌ సంబంధిత శిక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా ఆయా రంగాల్లో ఉత్సాహవంతులైన రైతులను  గూర్తించించాలన్నారు. వారికి ఆయా రంగంలో శాస్త్రీయంగా మరిన్ని మెళకువలు కల్పించాలన్నారు. శిక్షణా తరగతులు ఆర్‌సెటి డైరెక్టర్‌ స్వయంగా వీటిని రూపోందించాలని ఆదేశించారు. గ్రావిూణ ప్రాంతాలనుంచి జిల్లా కేంద్రానికి తీసుకువచ్చి శిక్షణ తరగతులు
నిర్వహిస్తే రైతులకు రోజువారి పనులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నందున స్థానికంగానే ఇవ్వాలన్నారు. ఇదిలావుంటే  పాడి పోషణపై సభ్యులు ప్రత్యేక దృష్టి సారించాలని ములుకనూరు సహకార గ్రావిూణ బ్యాంకు అధ్యక్షుడు అన్నారు. దీంతో మంచి ఆదాయం ఉందన్నారు. మహిళల పరస్పర సహకారంతోనే డెయిరీ అభివృద్ధి చెందుతుందన్నారు. డెయిరీలో వచ్చిన లాభంలో ఇప్పటి వరకు రూ.22 కోట్ల వరకు బోనస్‌ను సభ్యులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది పాల అమ్మకాల్లో వచ్చిన లాభంపై బోనస్‌ను సభ్యులకు అందచేస్తున్నట్లు వెల్లడించారు.

Other News

Comments are closed.