పాతప్రయాణం కొత్తగా మొదలైందన్న కరణ్‌

share on facebook


రణ్‌వీర్‌ సింగ్‌ ` అలియా భట్‌ జంటగా ’రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’ అనే టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. పదేళ్ళ తర్వాత మళ్ళీ మెగా ఫోన్‌ పట్టిన స్టార్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం విశేషం. చిత్ర షూటింగ్‌ మొదలైంది. సోషల్‌ విూడియా ద్వారా చిత్రబృందం ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ సందర్భంగా కరణ్‌ జోహార్‌ మాట్లాడుతూ.. ’మళ్లీ నా పాత ప్రయాణం కొత్తగా మొదలైంది. ఓ మంచి ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. తప్పకుండా ఈ చిత్రం భావోద్వేగాలు నిండిన ప్రేమ కథే’..అని చెప్పారు. కాగా ఇందులో ధర్మేంద్ర, జయా బచ్చన్‌, షబానా అజ్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Other News

Comments are closed.