పాత పెన్షన్‌ విధానం పునరుద్దరించాలి

share on facebook

వరంగల్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బద్ధం వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆందోళనలు చేస్తున్నా పట్టించుకో పోవడం సరికాదన్నారు. పాతపెన్షన్‌ అమలు చేసే వరకు ఐక్య పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించారు. సంఘటిత పోరాటాలతోనే ప్రభుత్వానికి కనువిప్పు కలిగి సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. డెమొక్రటిక్‌ టీచర్స్‌ ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణలో భాగంగా ప్రంపచబ్యాంకు ఆదేశాల మేరకు ప్రభుత్వాలు ఉద్యోగుల ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని చెప్పారు. కంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. దీనిని తక్షణం ఎత్తేసి పాత విధానం కొనసాగించాలన్నారు. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని అన్నారు.

———

 

Other News

Comments are closed.