పారిశుద్ధ్యం ఆరోగ్యానికి శ్రీరామరక్ష – కాసాని

share on facebook

కూసుమంచి సెప్టెంబర్ 8 ( జనంసాక్షి ) :  పచ్చదనం పరిశుభ్రత జీవన ప్రమాణం పెంచుతాయని దేశానికి పల్లె సీమలు పట్టుగొమ్మ లాంటిదని పల్లెల్లో నివసించే జనాభా ఆరోగ్యంగా ఉండాలంటే  ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్యాన్ని పాటించాలని మొక్కలు నాటాలని నాయకుని గూడెం సర్పంచ్ కాసాని సైదులు అన్నారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం రోజున గ్రామంలోని ఎస్సీ కాలనీలో రోడ్డు పక్కన ఉన్న పెంట కుప్పల ను పిచ్చి మొక్కలను తొలగించారు సైడు కాలువలో బ్లీచింగ్ పౌడర్ చలించి   ఫాగింగ్ నిర్వహించారు కాలనీలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి కాలనీవాసులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ఉచిత మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు మరియు స్థానిక ఎంపిటిసి కంచర్ల పద్మ వీరారెడ్డి ,ఎంపీడీవో కుసు వెంకటేశ్వర్లు , ఈ ఓ పి ఆర్ డి ఓ రవి ,గ్రామ ప్రత్యేక అధికారి సిహెచ్ శ్రీనివాసరావు ,ఏ పీ ఓ నాగరాజు, వి ఆర్ ఓ నాగుల్ మీరా ,పంచాయతీ సెక్రటరీ సహజ, వార్డు మెంబర్లు, కో ఆప్షన్ నెంబర్ లు ,గ్రామ మాజీ సర్పంచ్ కంచర్ల వీరారెడ్డి,  ఏఎన్ఎంలు రాణి ,ఉపేంద్ర రాణి, ఆశా వర్కర్లు, వీఆర్ఏ శ్రీనివాసు ,స్థాయి సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.