పారిశుద్యంపై అవగాహన పెంచుకోవాలి

share on facebook

చిత్తూరు,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): ఇటీవల నమోదవుతున్న విషజ్వరాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న తెలిపారు. ప్రజలు వర్షాలు కురుస్తున్నందున అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో దోమలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించిన్నట్లు తెలిపారు. ఇకపోతే జిల్లాలో మున్ముందు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే నిండిన చెరువుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ప్రద్యుమ్న ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అధిక భాగం చెరువులు నీటితో నిండిపోయాయి. మరికొన్ని రోజులు వర్షాలు కొనసాగనున్నాయి. పంట నష్టాలను కచ్చితంగా లెక్కించాలన్నారు. వర్షాలకు దెబ్బతింటున్న రోడ్లకు వేగంగా మరమ్మతులు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో చెరువు గట్లు తెగిపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు చెరువుల పరిస్థితిని అంచనా వేసుకుంటూ సవిూక్షించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండలంలో ప్రొక్లెయిన్లు, జేసీబీలు, ఇసుక బస్తాలను సిద్ధం చేసి ఉంచుకోవాలని అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు యుద్ధప్రాతిపదిక సహాయ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలన్నారు. వాగుల వద్ద రాకపోకలపై నిఘా ఉంచాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వర్షాలకు సంబంధించిన నష్టాలను ఎప్పటికప్పుడు పక్కాగా నమోదు చేసి నివేదికలు జిల్లా సచివాలయానికి పంపాలని కలెక్టర్‌ సూచించారు.

Other News

Comments are closed.