పూర్వవైభవం కోసం కాంగ్రెస్‌ అపసోపాలు

share on facebook

రాష్ట్ర విభజనతో రెండు తెలుగు రాష్టాల్ల్రో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పూర్వ వైభవం కోసం కసరత్తు చేస్తున్నా పెద్దగా ఫలిస్తున్నా జాడలు కనిపించడం లేదు. తెలంగాణలో అంతో ఇంతో పార్టీకి పట్టున్నా అంతర్గత కలహాలు ఆ పార్టీని దెబ్బతీస్తున్నాయి. అధికారంలోకి రాకముందే నేతలు పగటి కలలు కంటున్నారు. ఎవరికి వారు ముఖ్యమంత్రి అన్న రీతిలో సాగుతున్నారు. దీంతో పార్టీ పుట్టిమునిగే పరిస్థితుల్లో ఉంది. నేలవడిచి సమాఉ చేస్తున్న చందంగా ఉంది. సమస్యలపై కాకుండా, సొంత ఎజెండాతో నేతలు పనిచేస్తున్నారు. దీంతో కెసిఆర్‌ను టార్గెట్‌ చేసినా ప్రజల్లో పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. కెసిఆర్‌ టార్గెట్‌ అన్నది ప్రజల్లోకి వెళ్లడం లేదు. సమస్యలను ఎత్తి చూపి వాటిని ప్రజల్లో చర్చించే కార్యక్రమం జరగడం లేదు. ఇకపోతే ఎపిలో జీరో నుంచి మొదలు పెట్టారు. కాబట్టి ఫర్వాలేదనుకోవాలి. ఎపి కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీని నియమించి ‘ఘర్‌ వాపసీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదేశాలతో పూర్వ నేతలను పార్టీలకి రప్పించి పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ చేపట్టారు. కాంగ్రెస్‌ నుంచి అనేకమంది ఇప్పుడు వైకాపాలో లేదా టిడిపిలో, మరికొందరు బిజెపిలో ఉన్నారు. బిజెపిలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ ఏకంగా పార్టీ అధ్యక్షుడయ్యారు. కావూరి సాంబశివరావు, పురంధేశ్వరిలు ఇంకా అందులోనే కొనసాగుతున్నారు. వీరిలో పురంధేశ్వరి ఇక బిజెపిలోనే ఉండిపోతారన్న ప్రచారం ఉంది. కావూరి సాంబశివరావు వెనక్కి వస్తారా లేదా అన్నది తెలియదు. /ూష్ట్రంలో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే విడగొట్టిన తరవాత ఏర్పడ్డ అఖాతాన్ని పూడ్చాలి. అందుకే ప్రత్యేక¬దా అంశాన్ని కాంగ్రెస్‌ దొరికి పుచ్చుకుంది. రాహుల్‌ తొలి సంతకం ప్రత్యేక¬దాపైనే అని చెప్పడం ద్వారా ప్రజల్లో నమ్మకం కలిగించే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకే భారీ లక్ష్యంతో చేపట్టిన ‘ఘర్‌ వాపసీ’ కార్యక్రమం అమలు బాధ్యతను ఊమెన్‌ చాందీకి పార్టీ అధిష్ఠానం అప్పగించింది. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వాని స్తున్నారు. భారతీయ జనతా పార్టీలో చేరాలని కిరణ్‌కుమార్‌రెడ్డి భావిస్తున్నట్టు ఒకానొక దశలో వార్తలు వచ్చినప్పటికీ, మారిన పరిస్థితుల కారణంగా కాంగ్రెస్‌లో తిరిగి చేరడానికి కిరణ్‌ సుముఖత వ్యక్తంచేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌ పార్టీలో అధికారికంగా చేరబోతున్నారు. తన చేరిక వల్ల కాంగ్రెస్‌ పార్టీకి ఊపు రావాలంటే తనతో పాటు మరికొందరిని కాంగ్రెస్‌లో చేర్చాలని కిరణ్‌కుమార్‌రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన తన పూర్వపు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారితో సంపప్రదింపులు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాలేకపోయినా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్‌రెడ్డిని ఓడించ గలిగితే కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుంటుందని కిరణ్‌కుమార్‌రెడ్డి అంచనా వేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయం లో సమైక్య రాష్ట్రం కోసం చివరి వరకు పోరాడిన వ్యక్తిగా కిరణ్‌కుమార్‌రెడ్డికి సీమాంధ్ర ప్రజలలో గుర్తింపు ఉంది. ఈ కారణంగా కాంగ్రెస్‌ను విమర్శించేవాళ్లు కూడా కిరణ్‌కుమార్‌రెడ్డిని విమర్శించలేని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్‌లో కిరణ్‌ చేరితే ఈ పరిణామం తమకు ఉపయోగ పడుతుందన్నది పార్టీ అధిష్ఠానం ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగా ప్రజలలో రాజశేఖర్‌రెడ్డికి ఉన్న మంచి పేరును వాడుకుని పార్టీని బలోపేతం చేయాలన్న వ్యూహంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా ఉంది. రాజశేఖర్‌రెడ్డికి అనుకూలంగా కాంగ్రెస్‌ నాయకులు ప్రచారంచేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్ఠానవర్గం ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల పై దృష్టి సారించింది. రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికై వ్యూహాన్ని రచించిందిముందుగా ఉమెన్‌ చాందీని రంగంలోకి దింపింది. కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌ తరలిపోవడం వల్లనే కాంగ్రెస్‌ ఓడిపోయిందన్న నిర్ధారణకు వచ్చారు. దానికి విభజన పాపం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. దీనిని అధిగమించాలంటే ప్రత్యేక¬దా వ్యవహారం మళ్లీ తెరపైకి తేవడం ద్వారా అటు టిడిపిని, ఇటు వైకాపాను దెబ్బకొట్టాలని చూస్తున్నారు. అయితే గాయపడ్డ తెలుగు ప్రజలు అంత ఈజీగా కాంగ్రెస్‌ పార్టీని నమ్ముతారా అన్నది చూడాలి. వైసీపీ బలంగా ఉన్నంతకాలం కాంగ్రెస్‌ పార్టీ పుంజుకోలేదు. గత ఎన్నికల సందర్భంగానూ, ఆ తర్వాత కాంగ్రెస్‌కు చెందిన పలువురు భారతీయ జనతా పార్టీలో చేరినప్పటికీ ఆ పార్టీ బలపడకపోవడానికి కూడా జగన్మోహన్‌రెడ్డి బలంగా ఉండటమే కారణం.వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే జగన్మోహన్‌రెడ్డి మరింత బలపడతారనీ, అదే జరిగితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి ఇంకా కోలుకోలేని విధంగా తయారు కాగలదు. అందుకే ఈ రెండు పార్టీలను ఏకకాలంలో దెబ్బకొట్టాలంటే విభజన గాయాలను మాన్పడానికి మందు పూయాలి. ప్రత్యేక¬దాతో ప్రజల్లో భరోసా కల్పించాలి. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్‌పై కోపం తగ్గాలంటే ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తే రాష్టాన్రికి ప్రత్యేక ¬దా ఇస్తామని పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ప్రకటన చేయించాలని కూడా రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు నిర్ణయించుకున్నారు. బీజేపీ ఎలాగూ ¬దా చేయదని తేలిపోయింది. ఈ సమయంలో ¬దా హావిూ ఇస్తే ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుంది. అంతేగాకుండా అదే పెద్ద ప్రచారాంశం కాగలదు. అందుకే ఉమెన్‌ చాందీ ముందుగానే దీనిపై పెద్దగా ప్రచారం చేపట్టారు. హావిూలు ప్రకటనలకే పరిమితం కాకుండా కేంద్రంలో రాహుల్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తోందన్న అభిప్రాయం ప్రజలలో కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఎంతవరకు ఫలిస్తాయన్నది మున్ముందు జరిగే పరిణామాలను బట్టి తేలనుంది.

 

Other News

Comments are closed.