పూలే,అంబేద్కర్ సర్కిల్ లను ఏర్పాటు చేయాలి

share on facebook

అలంపూర్ జూలై30 (జనంసాక్షి)
అలంపూరు పట్టణము నందు పూలే,అంబేద్కర్ సర్కిల్ ఏర్పాటు చేయాలని బహుజన సమాజ్ పార్టీ నాయకులు మహేష్ అన్నారు.శనివారం బహుజన సమాజ్ పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్ కివినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా అలంపూర్ నియోజకవర్గ అధ్యక్షులు బి.మహేష్ మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనులలో భాగంగా మహాత్మా జ్యోతి రావు ఫూలే మరియు డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను వెనక్కు నేట్టాలన్న మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ల తీర్మానాన్ని వెనక్కు తీసుకొని, ఇట్టి మహానీయులను అవమానపరాచకుండగా వారి విగ్రహాలుఒకే చోట కూడలి ( చౌరస్తా సెంటర్ ) గా ఏర్పాటు చేయాలని, అలాగే ఇట్టి సెంటర్ లను ఫూలే , అంబేద్కర్ సర్కిల్ గా నామకరణం చేయాలని,బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్, ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మాట తప్పిన సంగతి అందరికి తెలిసిందే అన్నారు. అధి నాయకుడు బాటలోనే అధికార పార్టీ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు నడుస్తూ మహనీయుల విగ్రహాలను వెనక్కి నెట్టాలన్న ఆలోచనను విరమించుకోవాలని లేని పక్షాన మహాత్మ జ్యోతిబాపూలే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయా సాధకులను అభిమానులను ఏకంచేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అన్నారు .ఈ కార్యక్రమంలో ,ఉపాధ్యక్షుడు యామని సుంకన్న,దేవరపోగు నాగరాజు,కోనేరు మద్దిలేటి,దేవరపోగు ప్రకాశం,నవిన్,మద్దిలేటి,తదితరులు పాల్గొన్నరు.

Other News

Comments are closed.