పెరుగుతున్న చలిగాలులు

share on facebook

 

హైదరాబాద్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): హైదరాబాద్‌పై చలి పంజా విసరడంతో చలికి నగరవాసులు వణికిపోతున్నారు. క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాది నుంచి వస్తున్న శీతల పవనాల వల్లనే ఇలా జరగుతోందని అంటున్నారు. సాధారణంగా మధ్నాహ్నం వేళల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటు చలిగాలుల తీవ్రత మరింత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగరంలో సాధారణకంటే 4-5 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. వారం రోజుల్లో చలితీవ్రత మరింతగా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దీంతో రాత్రి సమయాల్లో బయటకు వెళ్లేవారు ముఖాలకు, చేతులకు మాస్క్‌లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉత్తరాది నుంచి నగరంపైకి వీస్తున్న పొడి గాలులతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. చలిబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది.

Other News

Comments are closed.