పైలట్‌కు అస్వస్థత : గోవాలో దింపిని సిబ్బంది

share on facebook

తిరువనంతపురం,నవంబర్‌11(జ‌నంసాక్షి): కేరళ నుంచి వెళ్తున్న ఓ ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో పైలట్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో విమానాన్ని దారి మళ్లించి అత్యవసరంగా గోవాలో ల్యాండ్‌ చేశారు. ఖతార్‌ ఎయిర్‌లైన్‌కు చెందిన క్యూఆర్‌-507 విమానం శనివారం కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి ఖతార్‌ రాజధాని దోహా బయల్దేరింది. మార్గమధ్యంలో పైలట్‌ అస్వస్థతకు గురవడంతో విమాన సిబ్బందికి విషయం చెప్పారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అధికారులతో చర్చించి విమానాన్ని దారి మళ్లించారు. గోవాలో అత్యవసరంగా విమానాన్ని దించి.. పైలట్‌ను ఆసుపత్రికి తరలించారు.

Other News

Comments are closed.