పొగమంచుతో నదిలో పడ్డ బస్సు: డ్రైవర్‌ మృతి

share on facebook

లక్నో,నవంబర్‌11(జ‌నంసాక్షి): ఉత్తరాది రాష్టాల్లో దట్టమైన పొగమంచు కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బాందాకు సవిూపంలో వంతెనపై ప్రయాణిస్తున్న ఓ బస్సు పొగమంచుతో నదిలో పడింది. జస్‌పూరా నుంచి బాందాకు వంతెనపై ప్రయాణిస్తున్న బస్సు టైరు పంక్చర్‌ అయ్యింది. ఆ మార్గంలో దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉండటంతో డ్రైవర్‌కు దారి కనపడక.. బస్సు అదుపుతప్పి వంతెన పైనుంచి నదిలో పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ మృతి చెందగా.. ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. స్థానిక అధికారులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Other News

Comments are closed.