పోటీ పరీక్షలకు అనుగుణంగా గ్రంథాలయ అభివృద్ది : కలెక్టర్‌

share on facebook

ఖమ్మం,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): పోటీ పరీక్షలకు అనుగుణంగా గ్రంధాలయాన్ని అభివృద్ది చేయిస్తామని జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. యువత కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఖమ్మం గ్రంథాలయాన్ని కలెక్టర్‌ సందర్శించారు. గ్రంథాలయంలో వివిధ విభాగాలను సందర్శించిన కలెక్టర్‌ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతతో ముచ్చటించారు. గ్రంథాలయంలో ఉన్న మౌలిక వసతుల విషయమై ఛైర్మన్‌ అజీజ్‌ ఉల్‌ హక్‌ని అడిగి తెలుసుకున్నారు. మూడు నెలల్లో గ్రంథాలయాలకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట గ్రంథాలయ కార్యదర్శి రవి కుమార్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

———–

 

Other News

Comments are closed.