పోర్ట్‌ ఎవరైనా అప్పగిస్తారా..

share on facebook

– ఇంగితం ఉండాలి చంద్రబాబూ
– ట్విటర్‌లో వైసీపీ ఎంపీ విజయసాయి విమర్శలు
అమరావతి, జులై30 (జనం సాక్షి)  : తెలుగు  రాష్ట్రాల్లో బందరు పోర్ట్‌ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. బందరు పోర్ట్‌ను తెలంగాణకు అప్పగిస్తారంటూ మళ్లీ ప్రచారం మొదలయ్యింది. తెర వెనుక పోర్ట్‌ను తెలంగాణకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు.. మాజీ మంత్రి లోకేష్‌లు ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ విమర్శలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో కౌంటరిచ్చారు. బందరు పోర్టును మరో రాష్ట్రానికి ఎలా అప్పగిస్తారో ఇంగిత జ్ణానం ఉన్నవారికి ఎవరికీ అర్థం కాదని విజయసాయి రెడ్డి అన్నారు. ‘ఓటుకు నోటు కేసులో పారిపోయి వచ్చిందీ తమరేనని, హరికృష్ణ శవం సాక్షిగా లాలూచీకి ప్రయత్నించి భంగపడింది విూరే కదా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించకండంటూ చంద్రబాబు, లోకేశ్‌లపై విజయసాయి మండిపడ్డారు. లోకేష్‌ను విజయసాయి తీవ్రస్థాయిలో టార్గెట్‌ చేశారు. విషయ పరిజ్ఞానం లేకుండా ట్వీట్లు ఏమిటయ్యా లోకేశ్‌ అంటూ ప్రశ్నించారు. విూ నాయన నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని, 2014లో 3,800 కోట్లున్న ఎక్సైజ్‌ ఆదాయాన్నినాలుగేళ్లలో 8 వేల కోట్లు దాటించారని, జనాలతో పూటుగా తాగించి రాబడి పెంచాలని అధికారులకు టార్గెట్లు పెట్టింది విూ తండ్రే కదా అంటూ విజయసాయి  ప్రశ్నించారు. విూ రాక్షస పాలనలో ఉద్యోగులుకు నిరసన తెలిపే అవకాశం ఎక్కడిచ్చారు చంద్రబాబు.. అంగన్‌ వాడీ చెల్లెమ్మలను గుర్రాలతో తొక్కించిన విషయం మరచిపోయారా.. అక్రమ అరెస్టులు, బెదిరింపులు, గూండాల్లా దాడిచేసిన విూ ఎమ్మెల్యేలు ఉద్యోగుల గొంతు నొక్కడం వల్లే కదా తమరు కుర్చీ నుంచి జారిపడిందంటూ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

Other News

Comments are closed.