ప్రగతినివేదన సభకు తరలిరండి: ఎమ్మెల్యే

share on facebook

జగిత్యాల,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న ప్రగతి నివేదన బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడి నుంచి తరలి వెళుతున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కె. విద్యాసాగర్‌ రావు అన్నారు. ఈ సభను జయప్రదం చేద్దామని రైతులంతా సంకల్పంతో వస్తున్నారని చెప్పారు.హైదరాబాద్‌ సవిూపంలోని కొంగరకలాన్‌లో నిర్వహించే ప్రగతి నివేదన బహిరంగ సభ దేశంలోనే అతిపెద్దసభ అని ఈ సభకు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావాలని కోరారు. ప్రగతినివేదన సభకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు దండులా కదలిరావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ప్రతి ఇంటి నుంచి ఒకరు చొప్పున కార్యకర్తలు తరలి రావాలని, అందుకోసం చిత్తశుద్ధితో పని చేయాలని, ప్రవాహపు దండులా కదలి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. సభలో నాలుగున్నరేళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన, అమలు పర్చిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌ ప్రజలకు వివరిస్తారని ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని వివరించేందుకు నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాలు గేళ్లలో చేస్తున్న అభివృద్ధి, పథకాల తీరును వివరించేందుకు ప్రగతి నివేదన సభను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మండలంలోని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారనీ, ఆయా గ్రామాల్లో ప్రజలను తరలించేందుకు కృషి చేయాలన్నారు.

 

Other News

Comments are closed.