ప్రగతిభవన్‌ ముట్టడికి నిరుద్యోగుల యత్నం

share on facebook

హైదరాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి):  గ్రూప్‌-2 నియామక పక్రియలో కొనసాగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ నిరుద్యోగ యువకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకొవాలని డిమాండ్‌ చేస్తూ గ్రూప్‌-2 సెలెక్టెడ్‌ అభ్యర్థులు శనివారం ఉదయం ప్రగతిభవన్‌ ముట్టడికి ప్రయత్నించారు. అక్కడికి చేరుకున్న అభ్యర్థులను పోలీసులు అరెస్ట్‌ చేసి గోషామహల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గ్రూప్‌-2 పరీక్షా నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని లాయర్ల కమిటీ చెప్పినా నియామకాలు జరపకుండా మా జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టుకు మే నెల నుంచి సెలవులు రానున్నందున ప్రభుత్వం చొరవ తీసుకుని సమస్య త్వరగా పరిష్కారమయ్యేలా కృషి చేయాలని కోరారు.

Other News

Comments are closed.