ప్రచారంలో దూసుకుపోతున్న టిఆర్‌ఎస్‌ వ్రేణులు

share on facebook

ముందస్తు అభ్యర్థుల ప్రకటనతో కలసి వస్తున్న వాతావరణం

కొత్తగూడెం,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ శ్రేణుల ర్యాలీలతో జిల్లాలో ఎన్నికల వాతావరణం మొదలైంది. టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుని పోతున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలందరూ ఆదరిస్తున్నారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలందరూ సంతోషంగా ఉంటే ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు.

ఒక వైపు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఐదు నియోజకవర్గాల అభ్యర్థులు జలగం వెంకటరావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావ్‌లు వారి నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. మోటర్‌ సైకిళ్ల ర్యాలీలు, అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి జరుగుతున్న చేరికలతో ఎన్నికల వ్యూహరచనతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో ముందంజలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అనుబంధ సంఘాల యువజన, విద్యార్థి, మహిళ,

కార్మిక విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇప్పటికే తమ అభ్యర్థులతో ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన మార్గాలపై చర్చిస్తున్నారు. ఈ పరిణామాలతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన శ్రేణులన్నీ నిరుత్సాహంతో తమ పార్టీ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారనే ఆలోచనలతో నిరీక్షిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తులు, సీట్ల సర్ధుబాటు కొలిక్కి వచ్చేసరికి ఎక్కువ సమయం పట్టే అవకాశాలు కనపడుతున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఎవరికీ వారు తమ ప్రచార విధానాలతో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల షెడ్యూల్డ్‌లో భాగంగా ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్ల నమోదు, సవరణలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేయడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులన్నీ ఓటర్ల షెడ్యూల్‌కు సంబంధించిన పనులు చేపట్టేందుకు కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. నాలుగున్నర ఏళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రధాన ప్రచార అస్త్రాలుగా ఈ ఎన్నికల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి తెలపాలని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు తమ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే వివిధ రూపాల్లో ప్రభుత్వ పథకాలను ఓటర్లకు వివరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతీ కుటుంబానికీ ఏదో ఒక రూపంలో ప్రయోజనాన్ని చేకూర్చాయి. ఈ విషయాన్ని కూడా ఆయా కుటుంబాలవారు ఆలోచన చేసుకునే విధంగా, టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచే విధంగా కలుసుకొని పార్టీ అభ్యర్థులను గెలిపించి కోరుతున్నారు.

Other News

Comments are closed.